శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 14:46:22

కాసేపట్లో సీఎం కేసీఆర్‌ అత్యున్నతస్థాయి సమావేశం

కాసేపట్లో సీఎం కేసీఆర్‌ అత్యున్నతస్థాయి సమావేశం

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 31 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై  సీఎం కేసీఆర్‌సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ప్రెస్‌ మీట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ వివరాలను వెల్లడిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో చప్పట్లు కొడతారు. logo