ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 26, 2020 , 21:56:24

నాయిని అహ‌ల్య మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

నాయిని అహ‌ల్య మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

హైద‌రాబాద్‌: మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి నాయిని అహల్య నరసింహారెడ్డి మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు. అహ‌ల్య కుటుంబ‌స‌భ్యుల‌కు సీఎం కేసీఆర్ త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. సీఎంతోపాటు హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ, మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, అజ‌య్ కుమార్, శ్రీనివాస్ గౌడ్‌, ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప‌‌లువురు ప్ర‌జాప్రతినిధులు తమ సంతాపం ప్ర‌క‌టించారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.