గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Feb 16, 2020 , 18:54:02

మంత్రి ఇంద్రకరణ్ కు సీఎం కేసీఆర్ బర్త్ డే విషెస్..

మంత్రి ఇంద్రకరణ్ కు సీఎం కేసీఆర్ బర్త్ డే విషెస్..

హైదరాబాద్ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆదివారం సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రగతిభవన్‌లో మంత్రి అల్లోల సీఎం కేసీఆర్ ను కలువగా..ఆయనకు సీఎం కేసీఆర్ మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండి..ప్రజాసేవ చేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అదేవిధంగా మంత్రి ఆల్లోలకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ నిత్యం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండి మరింత ప్రజా సేవ చేయాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంద్రకరణ్ కు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పలువురు నేతలు  శుభాకాంక్షలు తెలిపారు.logo
>>>>>>