శనివారం 16 జనవరి 2021
Telangana - Aug 22, 2020 , 01:30:13

ఉద్యోగులది వీరమరణం జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

ఉద్యోగులది వీరమరణం జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యుత్తు ఉద్యోగులు జాతి సంపదను కాపాడటం కోసం ప్రయత్నించి వీరమరణం పొందారని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పే ర్కొన్నారు. శ్రీశైలం జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలోమంటలు ఎగిసిపడుతున్నా, ప్రాణాలకు ముప్పు అని తెలిసినా ప్లాంటును కాపాడటానికి సాహసం చేశారని చెప్పారు.  ప్లాంటులో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలిం చకపోవడంపై కన్నీటి పర్యంతమయ్యారు. తన సుదీర్ఘ అనుభవంలో ఇంతటి విషాద సంఘటన మరొకటి లేదని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ప్రాణాలకంటే ప్లాంటే ముఖ్యమనుకున్నారు

ఉద్యోగులు ప్రాణాల కన్నా ప్లాంటు ముఖ్యమనుకొనే ముందుకు  వెళ్లారని సీఎండీ ప్రభాకర్‌రావు చెప్పారు. ప్రమాద తీవ్రత, మ ంటలు, పొగల వ్యాప్తితో ఏఈ మోహన్‌ సహా పలువురు బయటకు అడుగులు వేసినా.. సహోద్యోగులను కాపాడుకునే ప్రయత్నంలో మోహన్‌ తిరిగి లోపలికి వెళ్లాడని చెప్పారు. వారిని కాపాడాలని చేసిన ప్రయత్నం విఫలమైందని, ఆయన తిరిగి రాలేదని తెలిపారు. తిరిగొచ్చే పరిస్థితులు లేవని ఏఈలు మోహన్‌, సుందర్‌ ఇండ్లకు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చారు. మంటలు ఆర్పుతున్న వీడియోలో డీఈ శ్రీనివాస్‌గౌడ్‌ సిలిండర్లు తీసుకురమ్మన్న అరుపులు వినిపించాయి. 

1.2 కిలోమీటర్ల లోతులో ప్లాంటు

శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రాన్ని కాపాడుకునేందుకు ఉద్యోగులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రయత్నించారని తెలంగాణ ట్రాన్స్‌కో శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.  ‘900 మెగావాట్ల సామర్థ్యం ఉన్న శ్రీశైలం జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. 1.2 కిలోమీటర్ల లోతులో ప్లాంటు ఉన్నది. అక్కడికి సొ రంగమార్గంలోనే చేరుకోవాలి. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంటులో 17 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 8 మంది బ యటకు రాగలిగారు. మిగిలిన 9 మంది అక్కడే చిక్కుకుని ప్రా ణాలు కోల్పోయారు. ఎస్కేప్‌ టన్నెల్‌ ద్వారా వచ్చేందుకు ప్ర యత్నించినా  దట్టమైన పొగవల్ల సాధ్యం కాలేదు’ అని పేర్కొన్నది.

ప్లాంటంతా పొగ సూరింది

అమరరాజా కంపెనీ నుంచి వచ్చినవారు కొత్తగా వచ్చిన బ్యాటరీలను బిగించారు. రాత్రి 10.15 గంటలకు తర్వాత మా ఏఈ సార్లు మోహన్‌కుమార్‌, రిజ్వాన్‌ఫాతిమా, కంపెనీ వాళ్లం భో జనం చేద్దామనుకున్నాం. అంతలోనే ఏడీఈ గారు పరి గెత్తుకుంటూ వెళ్లగా.. మేమూ పరిగెత్తాం. ఏవీఆర్‌ ప్యానెల్‌ సర్వీస్‌బే నాలుగో యూనిట్‌ వద్ద మంటలు కనిపించాయి. అప్పటికే 2, 3, యూనిట్లు కాలి పోయాయి. ఆరో యూనిట్‌ వద్ద విపరీతంగా మంటలు వ చ్చాయి. తర్వాత పొగ అలుముకున్నది. డీఈ సార్‌, మేము మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాం. కరె ంట్‌ కూడా పోయింది.  మాస్కులు గట్టి గా వేసుకొని బయటికి వెళ్లాం. కొద్ది సేపయ్యాక ఓ కారు వచ్చింది. నేను మళ్లీ పరిగెత్తా. ఇక్కడ పనిచేస్తున్న ఓ కొత్త సీఈ సార్‌ను కూడా ఆ కారులో ఎక్కించా. దాదాపు అర గంట సేపు కష్టపడి బయ ట కొచ్చాం. మా టీంలో 15 మందిమి ఉన్నాం. 11 మందిమి తప్పి ంచుకున్నాం.  

- మత్రు, జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్‌

చస్తా అనుకున్నా 

బ్యాటరీ రూం దగ్గర పనిచేస్తుండగా.. షార్ట్‌ సర్క్యూట్‌ అయి ందనే అరుపులు విని పించినయ్‌. సార్‌వాళ్లు, మేం ప్రయత్నించి నం. అయినా మంటలు ఆగలేదు. ఎం సీఆర్‌ విభాగం వద్ద ఫాతిమా మేడమ్‌ వాళ్లు పనిచేస్తున్నారు. అప్పటికే కరెంట్‌ పోయింది. ఏమీ కనిపించలేదు.  బయటకు వచ్చేదారి తెల్వడంతో గోడను పట్టుకుని వచ్చాం. 

-వెంకటయ్య, జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్‌

నువ్వూ, పిల్లలూ జాగ్రత్త అన్నారు

మా ఆయన రాత్రి 8 గంటలకు డ్యూటీకి వెళ్లిండు. మేము తిని పడుకుంటుండగా రాత్రి 10.30 గంటలు దాటాక ఆయన నుంచి ఫోన్‌ వచ్చింది. లిఫ్ట్‌ చేయగానే.. ‘పవర్‌ప్లాంట్‌లో కరెంటు షాక్‌ వచ్చింది. పెద్ద మంటలు వచ్చినయ్‌. మా షిఫ్ట్‌ ఏరియా మొత్తం పొగకమ్మింది. ఏమీ కని పించడం లేదు. లేవడానికి రావడం లేదు. ఊపిరాడటం లేదు. నేను బతికే పరిస్థితి కష్టంగా ఉన్నది.. పిల్లలు, నీవు జాగ్రత్త’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు. నన్ను, నా పిల్లలను అనాధలను చేసి వెళ్లిండు.

- పావని, ఏఈ మోహన్‌ భార్య