ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 14:23:42

సబ్బండ వర్ణాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

సబ్బండ వర్ణాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

హైదరాబాద్‌ : సబ్బండ వర్ణాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తామంతా అంకితభావంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. సేవాభావంతో వృద్ధుల ఆశ్రమాలను నడుపుతున్న వారికి  చేయూత నిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో ఆశ్రమాలను నెలకొల్పేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.