శనివారం 06 జూన్ 2020
Telangana - May 24, 2020 , 11:22:17

రైతుని రాజుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం : మంత్రి ఎర్రబెల్లి

రైతుని రాజుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం : మంత్రి ఎర్రబెల్లి

జనగామ : రైతే రాజు అనడం కాదు. నిజంగా రైతుని రాజుగా చూడాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నియంత్రిత పద్దతిలో పంటలు సాగు చేయాల్సిన అవసరం, రైతులు తమ ఉత్పత్తుల ద్వారా మంచి ధరలు పొంది లాభపడాల్సిన ఆవశ్యక్తపై జనగామ జిల్లాలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్మన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్‌, సభ్యులు, జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రభుత్వం చెప్పిన విధంగా లాభసాటి పంటలు వేసి రైతులు బాగు పడాలనేది సీఎం కేసీఆర్‌ సంకల్పమన్నారు.

ఏయే ప్రాంతాలలో ఏయే పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందో ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. వ్యవసాయశాఖ వద్ద శాస్త్రవేత్తలు రూపొందించిన పంటల ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేస్తేనే రైతుబంధు వంటి ప్రయోజనాలు అందుతాయన్నారు. ప్రభుత్వమే రైతులకు పెట్టుబడులు పెట్టి, రాయితీలు ఇచ్చి, రుణమాఫీలు చేసి, ఏ పంటలు వేయాలో చెప్పి, వాటికి డిమాండ ఎలా ఉందో, మార్కెట్‌ ఎలా ఉంటుందో ముందే నిర్దారించి రైతులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌ లాంటి సీఎం గానీ, టీఆర్‌ఎస్‌ లాంటి ప్రభుత్వం గానీ, తెలంగాణ వంటి రాష్ట్రం గానీ దేశంలోనే కాదు చరిత్రలో కూడా లేదని మంత్రి పేర్కొన్నారు.  


logo