గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 17:03:17

ఐదు వేల కోట్ల‌ న‌ష్టం... ప్ర‌ధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ‌

ఐదు వేల కోట్ల‌ న‌ష్టం... ప్ర‌ధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ‌

హైద‌రాబాద్ : భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఈ మేర‌కు సాయం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి లేఖ రాశారు. కాగా తక్షణ సహాయం, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరారు.

రాష్ర్టంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌పై రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్‌కోవింద్ ఆరా తీసిన సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం గ‌వ‌ర్న‌ర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఆప‌త్కాలంలో జాతి మొత్తం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటుంద‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోదీ సీఎం కేసీఆర్‌తో మాట్లాడారు. స‌హాయ‌క చ‌ర్య‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రం సాయం ఉంటుంద‌ని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ... భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌ను అన్ని ర‌కాలుగా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్న‌ద‌న్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల‌పై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. ఇప్ప‌టికే తీసుకున్న స‌హాయ‌క చ‌ర్య‌లు, చేపట్టాల్సిన చర్యలపై సీఎం స‌మీక్షించారు.


logo