మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 14:58:59

రైతుల మేలు కోసం సీఎం కేసీఆర్ కృషి : మ‌ంత్రి కొప్పుల

రైతుల మేలు కోసం సీఎం కేసీఆర్ కృషి : మ‌ంత్రి కొప్పుల

పెద్ద‌ప‌ల్లి : రాష్ర్టంలో కొత్త రెవెన్యూ చ‌ట్టం తీసుకువ‌స్తూ సీఎం కేసీఆర్ రైతుల మేలు కోసం కృషి చేస్తున్నార‌ని రాష్ర్ట సంక్షేమ‌శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వో) వ్యవస్థను రద్దు చేసినందుకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్, పత్తిపాక గ్రామాలకు చెందిన రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వీఆర్‌వో వ్యవస్థ రద్దుతో రెవెన్యూశాఖలో అవినీతికి అడ్డుకట్ట పడుతుందన్నారు. వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేయడం మంచి నిర్ణయమన్నారు.
logo