శనివారం 23 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:56:22

రూ.16 కోట్ల గీత పన్ను రద్దు చేసినం

రూ.16 కోట్ల గీత పన్ను రద్దు చేసినం

  • మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం, జనవరి 12(నమస్తే తెలంగాణ, ప్రతినిధి): కుల వృత్తులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రూ.16 కోట్ల మొదళ్ల(కల్లుగీత) పన్ను రద్దు చేసి గౌడ కులస్థులను ఆదుకొన్నారని మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో మంగళవారం మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత హరిత హోటల్‌, బైపాస్‌రోడ్‌లో బీసీ భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. క్రికెట్‌ మైదానంలో టఫ్‌ వికెట్‌, అథ్లెటిక్‌ సాండ్‌ ట్రాక్‌ ప్రారంభించారు. లకారం ట్యాంక్‌ బండ్‌పై తీగల వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సర్దార్‌ సర్వాయి పాపన్న కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం రామన్నపేటలో తాటి, ఈత వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సభా వేదికపై నీరా తాగారు. తర్వాత పంచాయతీ ఉద్యోగుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో కోల్పోయిన తాటి, ఈత చెట్లను తిరిగి పెంచాలన్న లక్ష్యంతో 3.75 కోట్ల మొక్కలు నాటామన్నారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ చేతి, కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చారని అన్నారు.


logo