శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 15:31:18

రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ : మ‌ందుల సామేలు

రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ : మ‌ందుల సామేలు

యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసిఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆదుకుంటున్నారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చ్తెర్మన్ మందుల సామేలు అన్నారు. శనివారం అడ్డగూడూర్ మండలంలోని స్వ‌గ్రామం ధర్మారంలో మందుల సామేలు మీడియాతో మాట్లాడారు. వీఆర్‌వో వ్యవస్థ రద్దు , నూతన రెవిన్యూ బిల్లు ఆమోదంతో గ్రామ గ్రామాన ర్తెతులు సంబురాలు జరుపుకుంటూ ఆనందంగా ఉన్నారన్నారు. తుంగతుర్తి నియెాజకవర్గం కాలేశ్వరం జలాలతో సస్యశ్యామలం అయిందన్నారు. కాగా మెాత్కూర్, అడ్డగూడూర్ మండలాలకు బునాదిగానికాల్వ, పిలాయిపల్లి, ధర్మారం కాల్వలు పూర్తి చేసి బస్వాపురం రిజర్వాయర్ ద్వారా సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్న‌ట్లు తెలిపారు. 

ధర్మారం పొలిమేరలో బిక్కేరు వాగుప్తె రూ. 8 కోట్ల 50 లక్షల 40 వేల వ్యయంతో చెక్ డ్యాంమ్ మంజూరు అయిందని చెప్పారు. ఈ వాగుకు నీరు రావడంతో అడ్డగూడూర్ మండలంలో సుమారు 7 వేల ఎక‌రాలు సాగులోకి వచ్చింది అన్నారు. అలాగే ధర్మారం చెరువును రిజర్వాయర్‌గా చేస్తే ధర్మారం, లక్ష్మీదేవికాల్వ గ్రామాలలో 4 వేల ఎక‌రాలకు నీరు పారుతుందన్నారు. 

అనంతరం ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శీలం జ్యోతి రాములు, టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు తాడోజు లక్ష్మణాచారి. వార్డు స‌భ్యులు మందుల సువర్ణజాని జక్కుల బాగ్యరావు,  టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోలినేని సోమయ్య, యూత్ అధ్య‌క్షులు మందుల స్తెదులు, ఎస్సీ సెల్ అధ్య‌క్షులు మందుల విజయ్,  నాయకులు సంద అంజయ్య కత్తుల నరేష్,  కప్పల కనకయ్య, మేకల పద్మయ్య, బండారి వీరయ్య, బాల్నె బిక్షం తదితరులు పాల్గొన్నారు.


logo