సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 22, 2020 , 00:37:34

సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సివిల్‌ సర్వీసెస్‌ డేను పురస్కరించుకొని.. వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. వివిధ స్థాయిల్లో సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. కొవిడ్‌-19 మహమ్మారిని అరికట్టడానికి చేస్తున్న పోరాటంలో సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. పౌరసేవలో అంకితభావాన్ని ప్రదర్శిస్తూ అనేక సందర్భాలలో సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు ఇతరులకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారన్నారు.


logo