శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 25, 2020 , 08:42:31

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పండుగ జరుపుకుంటామని సీఎం వివరించారు. కరోనా మహమ్మారిని జయించి రాష్ట్ర ప్రజలు సంతోషంగా, సుసంపన్నంగా జీవించేలా ఆశీర్వదించాలని దుర్గాదేవిని సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి ప్రజలు విజయదశమిని జరుపుకోవాలని ప్రజలను సీఎం కోరారు. 

అలాగే ప్రజలకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కృప అందరిపై ఉండాలని, చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అపజయాన్ని సైతం తట్టుకొని నిలబడగలిగే శక్తిని, దేన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలని అమ్మవారిని మంత్రి కొప్పుల వేడుకున్నారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.