శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Sep 21, 2020 , 16:12:36

'ధ‌ర‌ణి' పోర్ట‌ల్‌పై రేపు సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

'ధ‌ర‌ణి' పోర్ట‌ల్‌పై రేపు సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

హైద‌రాబాద్ : నూత‌న రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా తీసుకువ‌స్తున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌పై రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్న‌తాధికారుల‌తో ఉన్న‌త స్థాయి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌కు స‌మ‌గ్ర స‌మాచారంతో రావాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా రెవెన్యూ రికార్డుల‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించ‌డానికి ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న జ‌ర‌గాల‌ని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.