శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 18:32:34

ప్రజల హృదయాల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు : మంత్రి ఎర్రబెల్లి

ప్రజల హృదయాల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చ‌ట్టం న‌వ శకానికి నాంది అని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. కొత్త రెవెన్యూ చ‌ట్టం బిల్లు శాస‌న‌స‌భ‌లో ఆమోదం పొందిన సంద‌ర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంతో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పూర్తిగా అంతం అయి, రిజిస్ట్రేష‌న్లు, మ్యుటేష‌న్ల లో జాప్యం త‌గ్గిపోతుంద‌ని అన్నారు. 

నిజాం కాలం తర్వాత జ‌రుగుతున్న రెవెన్యూ చ‌ట్టం స‌మూల సంస్కరణ ఇదేన‌న్నారు. ఈ చ‌ట్ట సంస్కరణతో సీఎం కేసీఆర్ ప్రజలు‌, ప్రత్యేకించి రైతుల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌న్నారు. తెలంగాణ‌ను తెచ్చిన భూమి పుత్రుడు, రైతు బాంధ‌వుడిగా మారార‌ని, ఇప్పుడు తాజాగా భూ రక్షకుడిగా నిలిచార‌ని మంత్రి కొనియాడారు. అలాగే  స‌వ‌ర‌ణ‌ల‌తో పంచాయ‌తీరాజ్ బిల్లుని కూడా ఆమోదం పొందామ‌ని అన్నారు. ఈ బిల్లుతో పంచాయ‌తీల పాత్ర మ‌రింత క్రియాశీల‌కమ‌వుతుంద‌న్నారు. 


logo