శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 14:45:53

ఉద్య‌మ‌కారుల‌కు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తా‌రు: మ‌ండ‌లి చైర్మ‌న్‌

ఉద్య‌మ‌కారుల‌కు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తా‌రు: మ‌ండ‌లి చైర్మ‌న్‌

హైదరాబాద్‌: ఉద్య‌మ‌కారుల‌కు సీఎం కేసీఆర్ అన్యాయం చేయ‌ర‌ని మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి అన్నారు. మండ‌లి చైర్మ‌న్‌గా రాజ్యాంగ ప‌ద‌విలో సంతృప్తిగానే ఉన్నాన‌ని చెప్పారు. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో భాగంగానే ఇత‌ర పార్టీల నేత‌ల‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నార‌ని వెల్ల‌డించారు. 

సీఎం కేసీఆర్ అన్ని పదవులకు సమర్థుడేనని చెప్పారు. సీఎం త‌న‌కు ఏ బాధ్య‌త అప్పగించినా సమర్ధవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్ని రోజులు న‌డుస్తుంద‌నే విష‌యంపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటామని వెల్ల‌డించారు. అయితే 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందన్నారు. సభలో 4 బిల్లులు చర్చకు వస్తాయని తెలిపారు. మండలిలో కొత్తగా 8 సీట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 


logo