శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 16:30:44

కష్టాల్లో స్పందించి చేయూత నిస్తున్న సీఎం కేసీఆర్‌

కష్టాల్లో స్పందించి చేయూత నిస్తున్న సీఎం కేసీఆర్‌

మేడ్చల్‌ మల్కాజిగిరి : ప్రజల కష్ట కాలంలో వెంటనే స్పందించి సీఎం కేసీఆర్‌ పదివేల రూపాయల వరద సహాయాన్ని అందజేసి ఆదుకుంటున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. బుధవారం పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ, ఇందిరా నగర్‌ కాలనీ వాసులకు ప్రభుత్వ వరద సాయం పదివేల రూపాయలను  బాధితులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు వచ్చే ఎలాంటి కష్టాలకైనా సీఎం కేసీఆర్‌ స్పందిస్తున్నారని అన్నారు. 

దేశంలో ఇంత వేగంగా స్పందించి ప్రజలకు సాయాన్ని నగదు రూపంలో అందజేసిన ఘనత సీఎం కేసీఆర్‌ ఒక్కడికే దక్కుతుందన్నారు. ఎలాంటి విపత్తులు ఏర్పడినా ప్రజల పక్షాన నిలబడి సీఎం కేసీఆర్‌ చేయూతనిస్తున్నారని ప్రశంసించారు. ప్రకృతి వైపరీత్యాలైన అధిక వర్షాలు, కరోనా వంటి సమస్యలు ఏర్పడినా ప్రజలు మనోధైర్యం కోల్పోకుండా ఎప్పటికప్పుడు ఆదుకుంటూ రాష్ర్టాన్ని ముందుకు తీసుకపోతున్నారని మంత్రి వివరించారు. కార్యక్రమంలో కమిషనర్‌ సురేష్‌ కుమార్‌, మేనేజర్‌ నర్సింహులు, చైర్మన్‌ కొండల్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రెడ్యానాయక్‌, కౌన్సిలర్లు పాల్గొనారు.