మంగళవారం 07 జూలై 2020
Telangana - Apr 13, 2020 , 18:00:22

మాస్క్‌ ధరించిన సీఎం కేసీఆర్‌

మాస్క్‌ ధరించిన  సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫేస్‌ మాస్క్‌ ధరించారు. ఇవాళ ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష సందర్భంగా కేసీఆర్‌ మాస్క్‌ ధరించి సమావేశంలో పాల్గొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీకి ముందు   చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్నారు.

కొవిడ్‌ వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్‌ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్న సాయం, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు.  మరోవైపు సీఎం సహాయ నిధికి విరాళం అందజేయడానికి పలువురు ప్రముఖులు ప్రగతిభవన్‌కు వస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సీఎం కేసీఆర్‌ మాస్క్‌ ధరించి సమావేశాల్లో పాల్గొంటున్నారు. తెలంగాణలో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. logo