శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 26, 2021 , 13:26:21

స‌చివాల‌య నిర్మాణ ప‌నులు ప‌రిశీలించిన సీఎం కేసీఆర్‌

స‌చివాల‌య నిర్మాణ ప‌నులు ప‌రిశీలించిన సీఎం కేసీఆర్‌

హైద‌రాబాద్ : ‌నూత‌న స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ప‌రిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, ఉన్న‌తాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను అక్క‌డున్న సిబ్బందిని అడిగి సీఎం తెలుసుకున్నారు. 

రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులను ముంబైకి చెందిన షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ దక్కించుకున్న విష‌యం విదిత‌మే.  రూ.617 కోట్లతో నూతన సచివాలయ సముదాయాన్ని నిర్మించ‌నున్నారు. 

VIDEOS

logo