ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ ఏదైన ఉంది అంటే అది మనీ హెయిస్ట్ అని చెప్పవచ్చు. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ స్పానిష్ సిరీస్ ఇప్పటి వరకు నాలుగు సీసన్స్ కంప్లీట్ చేసుకుని ఐదవ సీసన్ షూట్ ని ఇటీవలే పూర్తి చేసుకుంది. దీని రిలీజ్ ఎప్పుడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో మేకర్స్ అనౌన్స్మెంట్ చేశారు.
ఫైనల్ సీజన్‌ను ఒక్క పార్ట్‌గా కాకుండా రెండు పార్ట్‌లుగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సీజన్ 5 పార్ట్ 1 సెప్టెంబర్ 3 న విడుదల చేయనుండగా పార్ట్ 2 డిసెంబర్ 3 న ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుందని పేర్కొన్నారు. మరి అభిమానులు సెప్టెంబర్ వరకు వెయిట్ చేస్తే కావలసినంత వినోదం లకాసా డి పాపెల్ అందించనుంది.