శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 27, 2021 , 18:24:34

వంటిమామిడి మార్కెట్‌యార్డును సందర్శించిన సీఎం కేసీఆర్‌

వంటిమామిడి మార్కెట్‌యార్డును సందర్శించిన సీఎం కేసీఆర్‌

సిద్దిపేట : జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్‌ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ను పరిశీలించిన సీఎం విక్రేతలు, కూర‌గాయ‌లు సాగుచేస్తున్న రైతుల‌తో మాట్లాడారు. కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. కూర‌గాయ‌ల రైతుల నుంచి ఏజెంట్లు 4 శాతం కంటే ఎక్కువ క‌మీష‌న్ తీసుకోవ‌ద్ద‌న్నారు. రైతులు కూర‌గాయ‌లు నిల్వ చేసుకునేందుకు వీలుగా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేప‌డ‌తామ‌ని సీఎం హామీ ఇచ్చారు. నిర్మాణానికి 50 ఎక‌రాల స్థ‌లంను గుర్తించాల్సిందిగా అధికారుల‌ను ఆదేశించారు. VIDEOS

logo