గురువారం 28 మే 2020
Telangana - May 15, 2020 , 10:00:50

సీఎం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వాయిదా

సీఎం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వాయిదా

హైదరాబాద్‌ : జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, రైతు బంధు సమితి అధ్యక్షులతో నిర్వహించాల్సిన సీఎం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వాయిదా పడింది. ఈ మేరకు రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ప్రకటించారు. 

శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కానీ అనివార్య కారణాల వల్ల ఈ వీడియో కాన్ఫరెన్స్ వాయిదా పడింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలను సాగుచేయాల్సిన అవసరం.. చేసే విధానంపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారని అధికార వర్గాలు నిన్న ప్రకటించాయి. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ, మార్కెటింగ్‌, పౌరసరఫరాలశాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, విత్తనాభివృద్ధి కార్పొరేషన్‌ అధికారి, వ్యవసాయ విస్తరణాధికారులతో పాటు జిల్లా, మండల, గ్రామస్థాయి రైతుబంధు సమితుల అధ్యక్షులు, కోఆర్డినేటర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి ఉండే. 


logo