శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 10:09:51

సీఎం కేసీఆర్‌ కొడకండ్ల పర్యటన షెడ్యూల్‌

సీఎం కేసీఆర్‌ కొడకండ్ల పర్యటన షెడ్యూల్‌

రైతులు సాగు సమస్యలపై చర్చిండం, అధిక దిగుబడులు, సస్యరక్షణ కోసం అవలంబించాల్సిన అధునాతన పద్ధతులపై అవగాహన పెంచుకొనేందుకు నిర్మించిన రైతు వేదికలు సిద్ధమయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభించనున్నారు. 

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాసేపట్లో  హైదరాబాద్‌లోని బేగంపేట  విమానాశ్రయం నుంచి హెలిక్యాప్టర్‌లో బయలు దేరి నేరుగా జనగామ జిల్లా కొడకండ్లకు మధ్యాహ్నం 12గంటలకు చేరుకుంటారు.
  • 12.10గంటలకు కొడకండ్ల రైతు వేదిక భవనాన్ని ప్రారంభిస్తారు.
  • 12.20 గంటలకు పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తారు.
  • మధ్యాహ్నం ఒంటిగంటకు కొడకండ్ల మండలం  రామవరంలోని వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు పనులను పరిశీలిస్తారు.
  • 1.30కు తిరిగి కొడకండ్లకు చేరుకుని 10వేల మంది రైతులతో ముఖాముఖిలో మాట్లాడుతారు.
  • 2.30 గంటలకు కొడకండ్లలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి గృహంలో భోజనం చేసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.