మంగళవారం 02 జూన్ 2020
Telangana - May 05, 2020 , 01:42:35

లాక్‌డౌన్‌ కొనసాగాలి

లాక్‌డౌన్‌ కొనసాగాలి

  • ఇది 76శాతం మంది అభిప్రాయం
  • కరోనా కట్టడిలో ముఖ్యమంత్రికేసీఆర్‌ పనితీరు అద్భుతం
  • ఒక టీవీ చానల్‌ సర్వేలో 85 శాతం మంది మద్దతు
  • లాక్‌డౌన్‌పై 76% మంది అభిప్రాయం  
  • కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనితీరు అద్భుతం
  • ఒక  టీవీ చానెల్‌ సర్వేలో 85% మంది మద్దతు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా వైరస్‌ను వైరస్‌ను పూర్తిగా నిర్మూలించేవరకూ విశ్రమించరాదని, అంతవరకూ లాక్‌డౌన్‌ను కొనసాగించాలని రాష్ట్రంలో అత్యధికమంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఓ టీవీ చానెల్‌ వివిధ సామాజిక మాధ్యమాలలో నిర్వహించిన సర్వేలో తెలంగాణలో లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేనని 76శాతం మంది అభిప్రాయపడ్డారు. వైరస్‌ను కట్టడిచేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని రాష్ట్రంలో అత్యధికమంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 


వైరస్‌ను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పాజిటివ్‌ కేసులు ఇంకా కొనసాగుతున్నందున నగరంలో లాక్‌డౌన్‌ కొనసాగించాలని 86శాతం మంది తెలిపారు. జిల్లాల వారీగా ప్రజాభిప్రాయాన్ని చూసినప్పుడు రంగారెడ్డిలో 85 శాతం, మెదక్‌లో 71 శాతం, కరీంనగర్‌లో 76 శాతం మంది లాక్‌డౌన్‌ కొనసాగింపునకే మొగ్గు చూపారు. నల్లగొండలో 77 శాతం, మహబూబ్‌నగర్‌లో 71 శాతం, వరంగల్‌లో 72 శాతం, ఖమ్మంలో 73 శాతం మంది లాక్‌డౌన్‌ కొనసాగాలని చెప్పారు. 

ఉత్తర తెలంగాణలో కూడా అదేస్థాయిలో అభిప్రాయం వ్యక్తమైంది. నిజామాబాద్‌లో 86 శాతం, ఆదిలాబాద్‌లో 76 శాతం మంది ఏది ఏమైనా చివరి దాకా కరోనాపై పోరు కొనసాగాల్సిందేనని చెప్పారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్‌ అని అత్యధికులు ప్రశంసించారు. సీఎం కేసీఆర్‌ పనితీరు అద్భుతమని అన్ని జిల్లాల్లోనూ సర్వేలో పాల్గొన్న 80 శాతం మంది కొనియాడారు. కరోనా నివారణ చర్యలలో కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వమే ఒక అడుగు ముందున్నదని సర్వేలో పాల్గొన్నవారు పేర్కొనడం విశేషం.logo