అండర్ వరల్డ్ నేపథ్యంలో సినిమాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. గతంలో ఆయన సత్య, కంపెనీ వంటి సినిమాల్లో అండర్వరల్డ్ మాఫియా నేపథ్యాన్ని వెండితెరపై చూపించారు. తాజాగా ఇప్పుడు ఈ కోవలోనే వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న మరో మాఫియా నేపథ్య చిత్రం ‘డి కంపెనీ’. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రామ్గోపాల్ వర్మ. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాని ఈ నెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్పార్క్ ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై స్పార్క్ సాగర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.