శనివారం 11 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 01:50:39

సీఎం చేతుల మీదుగా హరితహారం

సీఎం చేతుల మీదుగా హరితహారం

  • 25న నర్సాపూర్‌లో మొక్కనాటనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆరో విడుత ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ నెల 25న ప్రారంభించనున్నారు. మెదక్‌జిల్లా నర్సాపూర్‌ అడవి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా సీఎం మొక్కనాటి శ్రీకారం చుడుతారు. రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట మొక్కలు నాటే పని నిరంతరంగా కొనసాగాలని సీఎం అధికారులను ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ‘హైవే నర్సరీ’లు ఏర్పాటుచేయాలని  సూచించారు. logo