గురువారం 04 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:01:41

‘గోదావరి’పై సీఎం కేసీఆర్‌ భేటీ నేడు

‘గోదావరి’పై సీఎం కేసీఆర్‌ భేటీ నేడు

  • మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమావేశం
  • నీటి వినియోగంపై సమగ్ర చర్చ,దిశానిర్దేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కువ ఫలాల్ని పొందేందుకు అమలుచేయాల్సిన ప్ర ణాళికపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న ఈ సమావేశానికి హాజరుకావాలని ఇప్పటికే గోదావరి నదీ పరివాహక జిల్లాల మంత్రులను ఆహ్వానించారు. నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గోదావరిజలాల వినియోగంపై సీఎం కేసీఆర్‌ సమగ్రంగా చర్చించి.. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది.

 కాళేశ్వరంతోపాటు దేవాదుల, ఇతర ప్రాజెక్టుల ద్వారా 2020-21 నీటి సంవత్సరంలో ఎంత నీటిని వినియోగించుకోవాలనే దానిపై చర్చించనున్నారు. గోదావరి జలాలను సాధ్యమైనంత ఎక్కువ వినియోగించుకునేలా ప్రణాళికను రూపొందించే అవకాశాలున్నాయి. వేల చెరువుల్ని ఎప్పటికప్పుడు నింపుతూ.. వానకాలం సీజన్‌లో భారీఎత్తున సాగువిస్తీర్ణం జరిగేలా ఏం చేయాలనే దానిపై సీఎం కేసీఆర్‌ సూచనలు చేయనున్నట్టు తెలిసింది. logo