మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 09:54:15

ఆ బస్సుల రంగును తొలగించండి.. సీఎం కేసీఆర్‌ ఆదేశం

ఆ బస్సుల రంగును తొలగించండి.. సీఎం కేసీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌ : ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మంత్రి పువ్వాడ అజయ్‌ను ఆదేశించారు. గురువారం ఉదయం రవాణా శాఖ మంత్రి అజయ్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. మహిళలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉమెన్‌ బయో టాయిలెట్‌ బస్సులు గులాబీ రంగులో ఉండకుండా చూడాలని మంత్రిని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే బస్సుల రంగులు మార్చాలని అధికారులకు మంత్రి పువ్వాడ అజయ్‌ సూచించారు. 

ఖమ్మంలోని ఎస్సార్‌-బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సులను బుధవారం అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. ఈ బస్సులను మంత్రి అజయ్‌ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.


logo