ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 18, 2020 , 01:36:26

సీఎం కేసీఆర్‌ది చారిత్రక నిర్ణయం

సీఎం కేసీఆర్‌ది చారిత్రక నిర్ణయం

-ఎన్పీఆర్‌, ఎన్నార్సీ, సీఏఏను వ్యతిరేకించిన లౌకికనేత

-మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్‌హుస్సేన్‌ ప్రశంస

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్పీఆర్‌, ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్‌ హుస్సేన్‌ అన్నారు.  హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంకులోని కార్యాలయంలో కేసీఆర్‌ చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు జాకుల్లా, బాసిత్‌ తదితరులు పాల్గొన్నారు. 

సీఎం కేసీఆర్‌ దార్శనిక నేత: హోంమంత్రి మహమూద్‌అలీ 

ఎన్పీఆర్‌, ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా రాష్ట్ర ఉభయసభల్లో తీర్మానించడంపై హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ హర్షం ప్రకటించారు. ఎంతో దార్శనికత ఉన్న కేసీఆర్‌లాంటి నాయకుడు సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. 

బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ హర్షం

సీఏఏ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానించి సీఎం కేసీఆర్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చైతన్య కల్పదర్శి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కేసీఆర్‌ లౌకికతత్వానికి నిదర్శనం: టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియాశాఖ

 సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడంపై టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ హర్షం వ్యక్తంచేసింది. మతవివక్షకు ఆస్కారం ఉండకూడదని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించడం ఆయన లౌకికతత్వానికి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి కొనియాడారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి మద్దతుగా, సీఏఏకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.


logo