బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 14:09:42

మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి : ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌

మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి : ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలకు అపార నమ్మకముందన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వానికి రెండోసారి కూడా ప్రజలు జై కొట్టారన్నారు. మైనార్టీల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని.. జీఎస్టీ వల్ల రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు భారీగా నష్టపోయాయన్నారు.


logo
>>>>>>