శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Dec 11, 2020 , 12:20:30

ఢిల్లీ బయలుదేరిన సీఎం కేసీఆర్‌

ఢిల్లీ బయలుదేరిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కే సీఆర్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. మూడురోజులపాటు ఢిల్లీలో ఉండనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులును కలువనున్నారు. దీర్ఘకాలికంగా పెండిగ్‌లో ఉన్న పలు సమస్యలపై చర్చించేందుకు కేంద్ర మంత్రులతో భేటీకానున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర జల‌వ‌న‌రు‌ల‌శాఖ మంత్రి గజేం‌గ్రసింగ్‌ షెకా‌వ‌త్‌ను, రేపు పౌర‌వి‌మా‌న‌యాన, హౌసిం‌గ్‌‌శా‌ఖల మంత్రి హర్దీ‌ప్‌‌సింగ్‌ పురిని కలు‌వ‌ను‌న్నట్టు సమా‌చారం. ఈ ఇద్దరు మంత్రు‌లతో భేటీకి సంబం‌ధిం‌చిన షెడ్యూల్‌ ఖరా‌రై‌నట్టు తెలి‌సింది. అదేవిధంగా కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆది‌వారం ఆయన తిరిగి హైద‌రా‌బా‌ద్‌కు వచ్చే అవ‌కాశం ఉన్నట్టు తెలు‌స్తు‌న్నది.  

VIDEOS

logo