బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 14:39:57

రైతు రాజ్య‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం : ‌సీఎం కేసీఆర్

రైతు రాజ్య‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం : ‌సీఎం కేసీఆర్

జ‌న‌గామ : తెలంగాణలో రైతు రాజ్య‌మే సృష్టించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. జ‌న‌గామ జిల్లాలోని కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించి ప్ర‌సంగించారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌, రైతు వేదిక‌లు, రైతుబంధు, రైతుబీమా ఉట్టిగా పెట్టలేదు. రైతులంద‌రూ సంఘ‌టితం కావాల‌నే ఉద్దేశంతోనే వీట‌న్నింటిని చేప‌ట్టాం. రైతులు ఎవ‌రికీ వారే ఉంటే ఆగ‌మాగం అవుతాం. సంఘ‌టితంగా ఉన్న‌ప్పుడే ఫ‌లితాలు సాధ్య‌మ‌వుతాయి. లాభసాటి వ్య‌వ‌సాయం చేయాలి. కూర‌గాయాలు, ధాన్యం ధ‌ర‌లు ద‌ళారీల చేతుల్లోకి పోవ‌ద్దు. ఇవ‌న్నీ తొల‌గిపోవాలంటే రైతు వేదిక‌లే కీల‌క పాత్ర పోషిస్తాయి. రైతు వేదిక‌లు దేశానికి ఆద‌ర్శంగా నిల‌వ‌బోతున్నాయి. సంక‌ల్పం, చిత్త‌శుద్ధి, ధైర్యం ఉంటే ఏదైనా సాధించొచ్చు. తెలంగాణ‌లో రైతు రాజ్యం వ‌చ్చి తీరుత‌ది. రాష్ర్ట రైతుబంధు క‌మిటీ ధ‌ర నిర్ణ‌యించిన త‌ర్వాత మార్కెట్లోకి వెళ్లాలి. అప్పుడే గొప్ప‌గా రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు వ‌స్తాయి. తెలంగాణ రైతాంగ‌మంతా కొన్ని విష‌యాల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాలి. నేను సీఎం అయ్యేనాటికి వ్య‌వ‌సాయ శాఖ‌ను చంపేశారు. కానీ ఇప్పుడు వ్య‌వ‌సాయ శాఖ‌లో అన్ని పోస్టులు భ‌ర్తీ చేశాం. వ్య‌వ‌సాయ శాఖ అద్భుతంగా ప‌ని చేస్తుంది. 

ఇవి బ‌తుకుదెరువు వేదిక‌లు

ఈ వేదిక‌లు యాక్టివ్‌గా ఉండేలా రైతు బంధు క‌మిటీలు నాయ‌క‌త్వం వ‌హించాలి. ఇది గొప్ప నిర్ణ‌యం. 50 నుంచి 60 శాతం మంది ప్ర‌జ‌ల‌కు ఈ వేదిక‌లు బ‌తుకుదెరువు. ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ పెడితే స‌స్ప‌ష్టంగా చెప్పాను. ఏది ఏమైనా స‌రే.. మ‌న దేశం యొక్క ప‌రిస్థితి ఏవి నిలుపుద‌ల చేసినా, వ్య‌వ‌సాయం ఆప‌కూడ‌ద‌ని చెప్పాను. ప్ర‌పంచంలో 200 పైచిలుకు దేశాలున్నాయి. తెలంగాణ రాష్ర్టం కంటే చిన్న‌గా 180 దేశాలు ఉన్నాయి. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆహార రంగంలో స్వ‌యం శ‌క్తి ఉండాల‌ని సూచించాను. చాలా సీఎంలు నిజ‌మ‌ని చెప్పారు. అన్నం పెట్టే శ‌క్తి ప్ర‌పంచంలో ఎవ‌రికీ లేదు. ఎప్పుడు ప‌రిస్థితులు ఒకేలా ఉండ‌వు. అన్నం పెట్టే శ‌క్తి కేవ‌లం తెలంగాణ‌కు మాత్ర‌మే ఉంద‌న్నారు. 

ఉమ్మ‌డి ఏపీలో ఆగ‌మాగం

ఉమ్మ‌డి ఏపీలో రైతుల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఎరువులు, విత్త‌నాలు స‌కాలంలో పంపిణీ చేయ‌లేదు. కానీ కాలం మారింది. తెలంగాణ రాష్ర్టంలో రైతులు నిమ్మ‌లం అయ్యారు. ఇంకా కావాలి. రైతులు బాగుండాలి. కిరికిరి గాళ్లు ఎప్ప‌టికీ ఉంట‌రు. గ్రామాలు మంచిగా ఉండాలి. గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిపుష్టం కావాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం. కుల‌వృత్తుల‌ను బ‌లోపేతం చేయాలి. ఇండియా మొత్తంలో ఎక్క‌డా లేని విధంగా గొర్రెల పెంప‌కం దారుల‌కు 75 శాతం స‌బ్సిడీ ఇచ్చాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.