గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 02:11:39

నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు

నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు

‘నేను మా ఊర్లో ఇంట్ల పుట్టిన. అప్పుడు దవాఖానాలు లేవు. నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు. మరి ఇప్పుడు నువ్వెవరు అంటే ఏం సమాధానం చెప్పాలి? నా బర్త్‌ సర్టిఫికెట్‌కే దిక్కులేదంటే, మీ నాయనది తీస్కరమ్మంటే నేను సావాల్నా? నేను పుట్టిననాడు మాకు 580 ఎకరాల జాగా ఉన్నది. పెద్ద భవనం ఉన్నది. అట్లాంటి కుటుంబంలో పుట్టిన నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేకుంటే దళితులు, ఎస్టీలకు ఎక్కడిది? ఇవ్వాల వివరాలు తెమ్మంటే ఎక్కడ తేవాలి?

  • మా నాయనది తెమ్మంటే ఎట్ల?..
  • ప్రజల్లో సీఏఏపై అనేక అపోహలు, అనుమానాలు
  • సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం..
  • దీనికి బదులుగా జాతీయగుర్తింపు కార్డు పెట్టమన్నం
  • ఇప్పటికే దేశం పరువుపోతున్నది: సీఎం కేసీఆర్‌ ఆవేదన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రజల్లో అపోహలు, అనుమానాలు ఉన్నాయని, శాసనసభలో చర్చించి సభ్యుల అభిప్రాయాలు, ప్రజల ఆలోచనలను తెలియజేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సీఏఏ, ఎన్పీఆర్‌ విషయంలో ఆందోళన ఉన్నదన్న అక్బరుద్దీన్‌ ఒవైసీ మాటలు వాస్తవమేనని, ఇది దేశవ్యాప్తంగా ఉన్నదని చెప్పారు. ఇప్పటికే సీఏఏను వ్యతిరేకిస్తూ రాష్ట్రం తరఫున అభిప్రాయాన్ని క్యాబినెట్‌లో చెప్పామని, ఒక పూటసభలో సమగ్రంగా చర్చ పెట్టి, తీర్మానం చేస్తామని అన్నారు. ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయమైనందున ఈ తీర్మానం ద్వారా బలమైన సంకేతాలు పంపించాల్సిన అవసరమున్నదని స్పష్టంచేశారు. శనివారం శాసనమండలిలో, శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.


‘నేను మా ఊర్లో ఇంట్ల పుట్టిన. అప్పుడు దవాఖానాలు లేవు. నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు. మరి ఇప్పుడు నువ్వెవరు అంటే ఏం సమాధానం చెప్పాలి? నా బర్త్‌ సర్టిఫికెట్‌కే దిక్కులేదంటే, మీ నాయనది తీస్కరమ్మంటే నేను సావాల్నా? నేను పుట్టిననాడు మాకు 580 ఎకరాల జాగా ఉన్నది. పెద్ద భవనం ఉన్నది. అట్లాంటి కుటుంబంలో పుట్టిన నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేకుంటే దళితులు, ఎస్టీలకు ఎక్కడిది? ఇవ్వాల వివరాలు తెమ్మంటే ఎక్కడ తేవాలి? సీఏఏకు బదులు జాతీయగుర్తింపు కార్డు పెట్టండని మేమంటున్నం. ఇప్పటికే దేశం పరువుపోతున్నది. యూఎన్‌, ఇంటర్నేషనల్‌ అసెంబ్లీలో చర్చ జరుగుతున్నది. 


మా పార్టీకి సిద్ధాంతం అంటూ ఉన్నది. మేం దేశంలో అంతర్భాగం. కచ్చితంగా మా వాణి వినిపిస్తం. తప్పకుండా శాసనసభలో చర్చ చేస్తం. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ, మండలిలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెడుతాం. ఇప్పటికే బీహార్‌ సహా ఐదారు రాష్ట్రాలు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. రాష్ట్రాల ఆలోచన, ప్రజల అభిప్రాయాలను కేంద్రానికి పంపిద్దాం. తీర్మానాన్ని కేంద్రం అంగీకరిస్తుందా, లేదా అనేది వేరే విషయం. దేశానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అనుకోవడం ఎన్పీఆర్‌, సీఏఏ పై అపోహలుంటే వంద శాతం తొలగించాల్సిన అవసరమున్నది. దీనిపై చర్చకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. సభ్యులందరికీ మాట్లాడటానికి సమయం ఇద్దాం. సగం రోజు దీనికే కేటాయించి చర్చిద్దాం. అసక్తి ఉన్న వాళ్లందరికీ మాట్లాడే అవకాశమిద్దాం. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. 


టీఆర్‌ఎస్‌, బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌, మజ్లిస్‌కు ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు. ఎవరైనా కుండబద్దలు కొట్టినట్టే చెప్తరు. సీఏఏను పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించింది. అన్ని రాజకీయపార్టీలకు స్పష్టమైన వైఖరి ఉంటుంది. ఎవరి వైఖరి వారిది. ప్రజలు అంతిమతీర్పు ఇస్తారు. ఎవరు తప్పుచేప్తే వారిని శిక్షిస్తరు. ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఢిల్లీ అల్లర్లలో ఇప్పటికే 40-50 మంది చనిపోయారు. ఇది చిన్న అంశం కాదు. సీఏఏపై దేశంలో పెద్దఎత్తున చర్చ నడుస్తున్నది. దేశ భవిష్యత్‌పైన చర్చ జరుగుతున్నది. ఘర్షణ వాతావరణం వద్దు. ఇప్పటికే టెన్షన్‌ ఉంది. ఇంకా టెన్షన్‌ క్రియేట్‌ చేయవద్దు’అని కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. 


త్వరలో పీఆర్సీ

  • ముందు సర్వీస్‌ రూల్స్‌ క్రమబద్ధీకరించుకుందాం
  • మండలి చర్చలో సీఎం కేసీఆర్‌

పీఆర్సీ విషయంలో కమిషన్‌ తేదీని పొడిగించిన మాట వాస్తవమేనని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఎమ్మెల్సీ జనార్దరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఉపాధ్యాయ సర్వీస్‌ నిబంధనలు కఠినంగా ఉండాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. మూడు పేజీల్లో ఉండాల్సిన నిబంధనల కోసం మూడువందల పేజీలు ఎందుకని అడిగారు. జీతాల చెల్లింపు ఒక్కటే కాదని, నిబంధనలన్నీ సెట్‌రైట్‌ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. అవసరమైతే అన్ని డిపార్టుమెంట్లలో వెయ్యి సూపర్‌ న్యూమరరీ పోస్టులను క్రియేట్‌ చేద్దామన్నారు. ఉద్యోగస్తుల సర్వీస్‌ రూల్స్‌ మొత్తం క్రమబద్ధీకరణ కావాలె. ప్రమోషన్లు ఆటోమెటిగ్గా రావాలి. అది ఉద్యోగుల హక్కు’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. రిటైరయ్యేనాటికి ప్యాకేజీ సిద్ధంగా ఉంచాలని సూచించారు. కంపాషనేట్‌ అపాయింట్‌మెంట్స్‌ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని తెలిపారు. ఇలాంటి పీడ మొత్తం పోవాలంటే, ఉద్యోగ, ఉపాధి సంఘాలన్నీ కూర్చొని చర్చించాలన్నారు. పరీక్షల తర్వాతనైనా అన్ని విభాగాల్లో పనిచేసేవారికి బ్లాంకెట్‌ ఆర్డర్‌ ఇస్తామని తెలిపారు. 


logo