సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 16:31:59

పది పరీక్షలపై సీఎం కేసీఆర్‌ రేపు ఉన్నతస్థాయి సమీక్ష

పది పరీక్షలపై సీఎం కేసీఆర్‌ రేపు ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌: వాయిదా పడిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పదోతరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా పదో తరగతి పరీక్షలు వాయిదాపడిన విషయం తెలిసిందే.     

కరోనా నివారణా చర్యలు, లాక్‌డౌన్‌ అమలుపై సీఎం కేసీఆర్‌ రేపు సాయంత్రం 4.30 గంటలకు సమీక్ష నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్యగశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీనియర్‌ అధికారులతో చర్చించనున్నారు. 


logo