అంగడిపేట రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్లగొండ : జిల్లాలోని అంగడిపేట దగ్గర గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యాధికారులను సీఎం ఆదేశించారు.
నాగార్జున సాగర్ -హైదరాబాద్ హైవేపై పీఏ పల్లి మండలం అంగడిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న బోలెరో వాహనాన్ని తప్పించబోయి ఆటో లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరకొండ దవాఖానకు తరలించారు. బాధితుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా చింతబావి గ్రామానికి చెందిన రోజువారీ కూలీలుగా గుర్తించారు. మృతులను ఆటో డ్రైవర్ మల్లేశం, నోమల పెద్దమ్మ, నోమల సైదమ్మ, కొట్టం పెద్దమ్మ, గొడుగు ఇద్దమ్మ, మల్లమ్మగా గుర్తించారు.
తాజావార్తలు
- పాల సేకరణ ధరలు పెంచిన కరీంనగర్ డెయిరీ
- దత్తత కుమారుడి పెండ్లికి హాజరైన రాజ్‌నాథ్ సింగ్
- శ్రీవారి ఆలయంలో వైభవంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ
- బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు: కేటీఆర్
- ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ 2021 అవార్డు అందుకున్న హైదరాబాదీ
- పనస పండు తింటే కలిగే లాభాలేంటి?
- డిజిటల్ ఫైట్: దిగ్గజాల మధ్య సవాళ్లు.. ఎవరెవరు ఎటువైపు?
- షుగర్ కంట్రోల్‌కు మెరుగైన ఆహారాలు..!
- పోలీసుల అదుపులో యూట్యూబ్ ఫేమ్ షణ్ముక్ జశ్వంత్
- ముగిసిన మేడారం మినీ జాతర