గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 29, 2020 , 18:54:39

గవర్నర్‌ తమిళిసైకు సీఎం కేసీఆర్‌ పరామర్శ

గవర్నర్‌ తమిళిసైకు సీఎం కేసీఆర్‌ పరామర్శ

హైద‌రాబాద్ : రాష్ర్ట గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌ను సీఎం కేసీఆర్ రాజ్‌భ‌వ‌న్‌లో క‌లిసి ప‌రామ‌ర్శించారు. త‌మిళిసై చిన్నాన్న, త‌మిళ‌నాడు క‌న్యాకుమారికి చెందిన లోక్‌స‌భ స‌భ్యుడు హెచ్‌. వ‌సంత్‌కుమార్ క‌రోనాతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ నేడు రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్‌ను ప‌రామ‌ర్శించారు. సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శ ప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాజ్‌భ‌వ‌న్‌కు విచ్చేసిన సీఎం కేసీఆర్.. వ‌సంత‌కుమార్ మృతిప‌ట్ల సంతాపం తెలిపి ప‌రామ‌ర్శించిన‌ట్లు తెలిపారు. 

కన్యాకుమారి కాంగ్రెస్ పార్టీ ఎంపీ హెచ్ వసంత్ కుమార్ కరోనాతో మరణించారు. కరోనా సోకడంతో అయన ఆగష్టు 10 వ తేదీన చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రిలో చేరారు. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు చేసిన యత్నాలు ఫలించలేదు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో నిన్న క‌న్నుమూశారు. 


logo