ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 19, 2020 , 17:05:45

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి సీఎం కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి సీఎం కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వానికి బాస‌ట‌గా నిలిచిన త‌మిళ‌నాడు స‌ర్కార్‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల న‌ష్ట‌పోయిన రాష్ర్టానికి రూ. 10 కోట్లు ఆర్థిక సాయం ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా, బ్లాంకెట్లు, చ‌ద్ద‌ర్ల‌తో పాటు ఇత‌ర సామాగ్రి కూడా పంపుతామ‌ని ప్ర‌క‌టించినందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి కేసీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఎంతో ఉదారంగా ముందుకు వ‌చ్చినందుకు సీఎం ప‌ళ‌నిస్వామికి, త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

భారీ వ‌ర్షాల కార‌ణంగా హైద‌రాబాద్ స‌హా ఇత‌ర జిల్లాల్లో ముంపు బాధితుల‌ను ఆదుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం స్పందించిన తీరును సీఎం ప‌ళ‌నిస్వామి ప్ర‌శంసించారు. తెలంగాణ‌కు రూ. 10 కోట్లు ప్ర‌క‌టిస్తూ సీఎం కేసీఆర్‌కు త‌మిళ‌నాడు సీఎం లేఖ రాశారు.