సోమవారం 13 జూలై 2020
Telangana - Feb 05, 2020 , 01:17:49

ఆర్టీసీ కార్గో బస్సులపై నా ఫొటోవద్దు

ఆర్టీసీ కార్గో బస్సులపై నా ఫొటోవద్దు
  • అధికారులకు స్పష్టంచేసిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ కార్గో బస్సులపై తన ఫొటోలు  వేయవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టంచేశారు. సరుకు రవాణాచేసే కార్గో బస్సులపై  ముఖ్యమంత్రి ఫొటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాటుచేస్తున్నట్టు మీడియాలో జరిగిన ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. ఆర్టీసీ బస్సులను సరుకురవాణాకు ఉపయోగించడంవల్ల ఒకవైపు ప్రజలకు సేవలు అందించ డం.. మరోవైపు సంస్థను లాభాల్లో పయనింపజేయడమే తన లక్ష్యమని,  బస్సులపై ఫొ టోలు వేయించుకొని ప్రచారం చేసుకోవాల్సి న అవసరం తనకులేదని, ఈ ప్రాతిపాదన ఆమోదయోగ్యం కాదని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వపథకాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలే తప్ప.. దానిద్వారా ప్రచారం పొందడం తమ అభిమతం కాద న్నారు. సీఎం కేసీఆర్‌ అభిప్రాయంతో సీఎం వో ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి.. ఆర్టీసీ ఎండీకి నోట్‌ పంపారు. కార్గో బస్సులపై సీఎం ఫొటో వేయరాదని అందులో సూచించారు.


logo