గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 12:49:38

రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు. కరోనా మహమ్మారి తొలగిపోవాలని సీఎం వేడుకున్నారు.

హైదరాబాద్‌ వ్యాప్తంగా పలు ఆలయాల్లో ఆదివారం ఆషాఢ బోనాలు జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి భక్తుల సందడి లేకుండానే వేడుకలు నిర్వహించారు. రేపట్నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో తెలంగాణ గ్రామాల్లో బోనాల వేడుకలను నిర్వహిస్తారు. నగర వ్యాప్తంగా నిరాడంబరంగా ఈ వేడుకలు జరిగాయి. తొలిసారిగా భక్తులు లేకుండానే ఉత్సవాలు జరిగాయి. అర్చకులు, నిర్వాహకులు అమ్మవారికి బోనాలు సమర్పించి కొవిడ్‌ను అంతమొందించాలని వేడుకున్నారు. 

తాజావార్తలు


logo