శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 11, 2020 , 18:53:44

పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రైతు బంధు పథకం కింద ఈ వానాకాలంలో పొందిన పెట్టుబడి సాయం రూ. 2,13,437ను గివ్‌ ఇట్‌ అప్‌(స్వచ్ఛందంగా వెనక్కి ఇవ్వడం) రైతు బంధు సమితి పేరు మీద చెక్కు రూపంలో సీఎం కేసీఆర్‌కు అందజేశారు. 

శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, రైతు బంధు సమితి సభ్యులు, అభిమానలు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంపీ సంతోష్‌ కుమార్‌ విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన నివాస ఆవరణలో దానిమ్మ, సీతాఫలం, సంపంగి మొక్కలను నాటారు. రైతు బంధు సమితి సభ్యులు, అభిమానులు గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా కోరారు. logo