శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 14:48:29

పది పరీక్షలపై సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం

పది పరీక్షలపై సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. సమావేశంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పది పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

టెన్త్‌ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో వాటిని రద్దు చేయాలా? నిర్వహించాలా? సాధారణ పరిస్థితులు వచ్చేది ఎప్పుడు? దీనికి ప్రత్యామ్నాయ విధానాలు ఏమిటి? వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది. 5.35 లక్షల మంది టెన్త్‌ జీవితాలను రిస్కులో పెట్టి పరీక్షలకు వెళ్లడం కంటే రద్దు చేసి ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించడం ఉత్తమమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంటర్నర్‌ మార్కులు, ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌, ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా టెన్త్‌ ఫలితాలు ప్రకటించి గ్రేడింగ్‌ ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

సాయంత్రం 4:30 గంటలకు కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై కూడా చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్‌పై తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు సీనియర్‌ అధికారులు హాజరు కానున్నారు. logo