శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 01:55:46

త్వరలో అందుబాటులోకి ధరణి

త్వరలో అందుబాటులోకి ధరణి

  • పోర్టల్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నేడు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భూపరిపాలనలో పారదర్శక విధానానికి కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకుంటున్నది. దేశంలోనే మొట్టమొదటిసారి విప్లవాత్మక రెవెన్యూ సంస్కరణలను సీఎం కేసీఆర్‌ చేపట్టారు. ఇందులో భాగంగానే కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో భూమి లావాదేవీలు నిర్వహించే ప్రక్రియకు సర్కారు శ్రీకారంచుట్టింది. ఇందులో కీలకమైన ‘ధరణి’ పోర్టల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో ‘ధరణి’ పోర్టల్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని సీఎం ఆదేశించారు.logo