బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 16:03:55

'ధ‌ర‌ణి' పోర్ట‌ల్‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

'ధ‌ర‌ణి' పోర్ట‌ల్‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

హైద‌రాబాద్ : భూపరిపాలనలో పారదర్శక విధానానికి కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకుంటున్నది. దేశంలోనే మొట్టమొదటిసారి విప్లవాత్మక రెవెన్యూ సంస్కరణలను సీఎం కేసీఆర్‌ చేపట్టారు. ఇందులో భాగంగానే కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో భూమి లావాదేవీలు నిర్వహించే ప్రక్రియకు సర్కారు శ్రీకారంచుట్టింది. ఇందులో కీలకమైన ‘ధరణి’ పోర్టల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు.

 ఈ క్ర‌మంలో ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ రెవెన్యూ అధికారుల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్న‌త‌స్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. పూర్తి పార‌ద‌ర్శ‌కంగా భూరికార్డుల నిర్వ‌హ‌ణ జ‌రిగేలా పోర్ట‌ల్ త‌యారీపై చ‌ర్చిస్తున్నారు. 

భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించే దిశ‌గా తీసుకొచ్చిన‌ కీల‌క‌మైన నూత‌న రెవెన్యూ బిల్లు కూడా చ‌ట్ట‌రూపం దాల్చింది. ఈ బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలుపడంతో ఇవాళ గెజిట్ నోటిఫికేష‌న్ జారీ అయింది. మొత్తానికి ఈ చ‌ట్టంలో భాగంగా ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను అత్యంత ప‌క‌డ్బందీగా రూపొందించ‌నున్నారు.


logo