గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 14:55:09

యాసంగి పంట‌ల‌ సాగుపై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

యాసంగి పంట‌ల‌ సాగుపై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

హైద‌రాబాద్ : ‌యాసంగి పంట‌ల సాగుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, ఆ శాఖ అధికారులు, నిపుణులు హాజ‌ర‌య్యారు. యాసంగిలో ఏయే పంట‌ల‌ను ఏయే ప్రాంతాల్లో సాగు చేయాల‌నే అంశంపై సీఎం చ‌ర్చిస్తున్నారు. 

వానాకాలంలో మాదిరిగానే యాసంగిలోనూ నియంత్రిత సాగు స్ఫూర్తి కొన‌సాగాల‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌తో నిన్న జ‌రిగిన స‌మావేశంలో మంత్రి నిరంజ‌న్ రెడ్డి వ్యాఖ్యానించిన విష‌యం విదిత‌మే. యాసంగి పంట‌ల సాగుపై ప్ర‌ణాళిక సిద్ధం చేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. ఈ యాసంగిలో మ‌క్క‌ల సాగు శ్రేయ‌స్క‌రం కాద‌ని, ఈ విష‌యాన్ని రైతుల‌కు వివ‌రించాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. యాసంగిలో సాగు విస్తీర్ణం 72 ల‌క్ష‌ల ఎక‌రాలు దాటే అవ‌కాశం ఉంద‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు.


logo