మంగళవారం 26 మే 2020
Telangana - May 11, 2020 , 18:17:12

కరోనా బాధితులకు అత్యుత్తమ సేవలు : సీఎం కేసీఆర్‌

కరోనా బాధితులకు అత్యుత్తమ సేవలు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. నివారణ చర్యలతో పాటు కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలన్నారు. కరోనా బాధితులకు ఇప్పటి మాదిరిగానే అత్యుత్తమ సేవలు అందించాలని సూచించారు. కరోనా ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. కరోనా ప్రభావం ఉన్నా జీవనం సాగే విషయంపై వ్యూహం అవసరమన్నారు సీఎం కేసీఆర్‌.

కాంటాక్ట్‌ వ్యక్తుల పరీక్షలు జరగాలి. ఒకరి నుంచి మరొకరికి కరోనా సోకకుండా క్వారంటైన్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. అన్ని రకాల పరికరాలు, మందులు, సదుపాయాలతో సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. వైద్యపరంగా అత్యుత్తమంగా స్పందిస్తామన్నారు. కరోనాతో పోరాడుతూనే ఇతరత్రా సిద్ధం కావాల్సి ఉందన్నారు. కొన్ని ఆర్థిక కార్యకలాపాలు కొనసాగాలి అని సీఎం చెప్పారు. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సండలింపులతో కొన్ని పనులు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. భవిష్యత్‌లో సడలింపుల అమలుపై ప్రతిపాదనలు ఇవ్వాలి. జోన్ల వారీగా అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. 


logo