శనివారం 06 జూన్ 2020
Telangana - May 12, 2020 , 19:07:45

నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలి : సీఎం కేసీఆర్‌

నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలి : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : పంట మార్పిడి, క్రాప్‌ కాలనీల ఏర్పాటుపై వ్యవసాయ శాఖ అధికారులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేయాలని సీఎం సూచించారు. నియంత్రిత పద్ధతిలో ఈ వర్షాకాలంలోనే వరి పంట సాగు ప్రారంభించాలని చెప్పారు.

ఈ నెల 15వ తేదీన క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా మాట్లాడాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే నానుడి రాష్ట్రంలో, దేశంలో ఎప్పటి నుంచో ఉన్నది అని సీఎం తెలిపారు. పండించిన పంట అమ్ముదామంటే అమ్ముడుపోదు. కావాల్సిన వస్తువులు కొందామంటే విపరీతమైన ధరలు ఉంటాయి. ఈ పరిస్థితి ఎప్పటి నుంచో ఉందన్నారు సీఎం. సేవారంగం, ఐటీ రంగం, కొత్త వృత్తులు ఈ మధ్య వచ్చినవి. గతంలో అంతా వ్యవసాయమే అని సీఎం గుర్తు చేశారు. 


logo