గురువారం 25 ఫిబ్రవరి 2021
Telangana - Jan 24, 2021 , 12:24:13

వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్: వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగు విధానం, పంటల కొనుగోలు అంశాలపై చర్చిస్తున్నారు. పంటల కొనుగోలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో పంట కొనుగోళ్లపై గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పంట కొనుగోళ్లపై కేంద్ర చట్టాల ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వం పంటలు కొనవచ్చా? లేదా? కొనుగోలు చేయాలంటే ఎలాంటి ప్రణాళికను అనుసరించాలి? లేదంటే రైతులకు పరిస్థితులను ఏ విధంగా వివరించాలి? తదితర అంశాలపై ఈ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

VIDEOS

logo