బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 22:43:03

వైద్య సిబ్బంది ఆత్మైస్థెర్యం దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు: సీఎం

వైద్య సిబ్బంది ఆత్మైస్థెర్యం దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు: సీఎం

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ పరిస్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... కరోనా రోగులకు చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఎంతమందికైనా చికిత్స అందించే సామర్థ్యం ప్రభుత్వ ఆసుపత్రులకు ఉంది. రోగులకు చికిత్స, సదుపాయాలపై కొందరు దుష్ఫ్రచారం చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో 2 వేల మందికి పైగా చికిత్స సామర్థ్యం ఉంది. గాంధీలో ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న పడకలు వెయ్యి ఉన్నాయి. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 247 మంది కరోనా రోగులు మాత్రమే ఉన్నాయి. గాంధీ ఆస్పత్రి కోవిడ్‌ పేషంట్లతో కిక్కిరిసిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ కారణంతో మరణించినా సరే కోవిడ్‌ పరీక్షలు చేయాలనడం సరికాదు. అందరికీ పరీక్షలు చేయాలనే హైకోర్టు ఆదేశం అమలుకు సాధ్యం కాదు. కరోనా విషయంలో వాస్తవ పరిస్థితికి, జరుగుతున్న ప్రచారానికి పొంతన లేదు. 9.61 లక్షల పీపీఈ కిట్లు, 14 లక్షల ఎన్‌-95 మాస్కులున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది ఆత్మైస్థెర్యం దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా విధుల్లో ఉన్నవారికి వైరస్‌ సోకడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో 480 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఐసీఎంఆర్‌ ప్రకారం దేశంలో 10 వేల మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 153 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. వైరస్‌ సోకిన వైద్య సిబ్బందిలో ఎవరి పరిస్థితి విషమంగా లేదని తెలిపారు.


logo