శనివారం 06 మార్చి 2021
Telangana - Jan 23, 2021 , 08:11:17

రేపు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

రేపు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖపై సీఎం కేసీఆర్‌ రేపు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతిభవన్‌లో జరుగనున్న ఈ సమావేశానికి అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్‌ అధికారులు హాజరుకానున్నారు. పంటలసాగు, కొనుగోళ్లు, గిట్టుబాటు ధర, అధికారుల పాత్రపై దిశానిర్దేశం చేయనున్నారు. యాసంగి సీజన్‌కు కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు.  

నేడు ప్రాజెక్టులపై సమీక్ష

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఆశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ నేడు సమీక్ష నిర్వహించనున్నారు. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే ఈ సమావేశంలో నోడల్‌ ఈఎన్‌సీ, ఈఎన్‌సీ, సీఈలు పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల పురోగతి, పనుల్లో వేగంపై చర్చించనున్నారు. అదేవిధంగా గట్టు, కట్పితో సహా అన్ని ప్రాజెక్టులపై సమగ్ర పురోగతిని పరిశీలించనున్నారు. పనులను వేగంగా పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.  

VIDEOS

logo