ఆదివారం 06 డిసెంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 19:05:03

కొవిడ్‌ ఆర్థిక నష్టంపై రేపు సీఎం కేసీఆర్‌ సమీక్ష

కొవిడ్‌ ఆర్థిక నష్టంపై రేపు సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణకు జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సమీక్ష జరుగనుంది. 2020-2021 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష జరుపనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, సవరించాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థికశాఖ అధికారులు సమీక్షకు హాజరుకున్నారు. శనివారం సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్నిశాఖల కార్యదర్శులతో సీఎం కేసీఆర్‌ సమావేమయ్యే అవకాశం ఉంది. అలాగే  సాయంత్రం యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో పురోగతిపై సైతం సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశానికి వైటీడీఏ స్పెషల్‌ ఆఫీసర్‌, యాదాద్రి కలెక్టర్‌, రోడ్లు భవనాలశాఖ అధికారులు, ఆలయ ఈవో హాజరుకానున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.