సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 03:06:32

మాజీ ప్రధానిని స్మరించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

 మాజీ ప్రధానిని స్మరించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. పీవీ నరసింహారావు వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయనను గుర్తుచేసుకున్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన వంటి రంగాలలో పీవీ నరసింహారావు ప్రవేశపెట్టి, అమలుచేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారతదేశం అనుభవిస్తున్నదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అంతర్గత భద్రత, విదేశాంగ వ్యవహారాల్లోనూ పీవీ నరసింహారావు అవలంబించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారత దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పటిష్ఠపరిచిందని సీఎం కొనియాడారు. బహుభాషావేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ఠసేవలు అందించిన పీవీకి ఘనమైన నివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. 


logo